Header Header

పిల్లలకోసం ఆరోగ్యవంతమైన స్నాక్స్ అనుకున్నట్లు తయారుచేయడం కనిపించినంత సులభంగా ఉండదు. స్నాక్స్ పిల్లలకి శక్తిని ఇవ్వటమే కాక వారి ఆకలి బాధను కూడా తీరుస్తాయి. ఎదిగే పిల్లలకు మంచి పోషకాలను అందించడానికి ఇది సరైన సమయం కావచ్చు.

ఒక తల్లి ఎప్పుడూ తన పిల్లలకు పోషకాలతో కూడిన స్నాక్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ, పిల్లలు తమకు రుచించిన ఆహారం వైపే మొగ్గు చూపుతారు.రుచి దెగ్గర రాజీపడ్డామో, పిల్లలు మూడీగా ఐపోయి స్నాక్స్ ని తినకుండా వదిలేస్తారు.దీంతో తమ పిల్లలకు పోషకాహారాన్ని రుచికరంగా అందించాలనుకునే తల్లులకు ఇది తలనొప్పిగా మారింది

ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలు చాలకపోవచ్చు పిల్లలు ఏదైనా సరదాగా ఉత్తేజకరంగా ఉండాలనుకుంటారు కాబట్టీ తన పిల్లలకి సరైన పోషణ అందించడానికి ఒక తల్లి ఏమి చెయ్యొచ్చు? సంప్రదాయ వంటకాలను ఆరోగ్యమైన స్నాక్స్ వంటకాలుగా మార్చడమే సులువైన మార్గం. కొన్ని పదార్ధాలను ఆరోగ్యమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేస్తే పోషకాలు పెరుగుతాయి. ఉదాహరణకు, బిస్కెట్లు చెయ్యడానికి మైదా బదులు రాగిపిండి వాడటం, ఇడ్లీలో బియ్యం బదులు ఓట్స్ వాడటం, ఉప్మాలో ఎక్కువగా కూరగాయలు వెయ్యడం, డీప్ ఫ్రైకి బదులు పాన్ లో వేయించడం ఇలా పిల్లలు ఆరోగ్యమైనవి తినడానికి చాలానే చెయ్యొచ్చు.

పిల్లలకు స్నాక్స్ టైములో పాలు ఇవ్వటం తల్లులకు మంచి ఎంపిక. పిల్లలు ఎక్కువగా వారికి నోరూరేవి ఎంచుకునేందుకు మొగ్గు చూపుతారు. పిల్లలకు స్నాక్స్ టైములో పాలను మిల్క్ షేక్ల రూపంలో అందించటం మరో మార్గం.

100% స్వచ్చమైన పాలనుండి చేయబడిన జెర్సీ థిక్ షేక్ స్నాక్స్ టైములో వేరే స్నాక్స్ తో తీసుకుంటే ఆరోగ్యం, సరదాలతో పాటు పరిపూర్ణతను కూడ అందిస్తుంది. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు ఇందులో ఉండటం వలన ఇది ఎదిగే పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ గానే కాక స్కూల్ నుంచి, ఆటల నుంచి లేదా ట్యూషన్ల నుంచి వచ్చాక తాజాదనాన్ని కూడ ఇస్తుంది.

చాక్లెట్, స్ట్రాబెర్రీ, బనానా, వనిల్లా లాంటి నాలుగు ఫ్లేవర్లలో లభిస్తుంది. వీటిని స్నాక్స్ టైములో, వేగమైన స్నాక్స్ తో పాటుగా పిల్లలకు ఇస్తే ఇది వారి పోషక విలువలను పెంచడమేకాక ఆటవిడుపుగా కూడ ఉంటుంది.

సిఫార్సు బ్లాగులు

జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి