Header Header

కావల్సిన పదార్థాలు

పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.

  • 250 గ్రాముల జెర్సీ పన్నీరు మీ ప్రాధాన్యత అనుగుణంగా పన్నీరును కోయండి.
  • 3-4 ఒక మాదిరి నుంచి పెద్ద సైజు టమోటాలు.
  • 15-20 జీడిపప్పు జీడిపప్పును మెత్తగా ముద్దగా గ్రైండ్ చేయండి.
  • 2-3 ఒక మాదిరి నుంచి పెద్ద సైజు ఉల్లిపాయలు.
  • 3 రెబ్బల వెల్లులల్లి మరియు 1 అల్లం ముక్క/ బాగా ముద్దగా నూరినది (రెడీమేడ్ అల్లం- వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మీరు ఉపయోగించవచ్చు).
  • 2 సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు.
  • మసాలా దినుసులు- గరం మసాలా, ధనియాల పొడి, ఎండు మిర్చి పొడి, కసూరి మేథీ.
  • రుచికి తగ్గట్టుగా ఉప్పు మరియు చక్కెర.
  • క్రీమ్ (ఐచ్ఛికం).
  • గార్నిష్ చేయడానికి కొత్తిమీర.
  • నూనె.
  • వెన్న.

తయారు చేసే విధానం

  • పాన్‌లో నూనె వేడి చేయండి.
  • ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఉల్లిపాయలను జోడించండి. కాసేపటి తరువాత మిరపకాయలను చేర్చండి.
  • బంగారు వర్ణంలోనికి మారేంత వరకు ఉల్లిపాయలు వేపండి.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ జోడించండి. తగినంత ఉప్పు వేయండి.
  • దీనికి టొమాటాలను జోడించండి. టొమాటాల ప్యూరీ అయితే బాగుంటుంది, మీ వద్ద ప్యూరీ లేనట్లయితే, టొమాటాలను బాగా చిన్న ముక్కలుగా తరగండి, తద్వారా ఉల్లిపాయలు, టొమాటాలు బాగా ముద్దగా కలుస్తాయి.
  • మిశ్రమానికి మసాలా దినుసులు చేర్చండి, అంటే, గరం మసాలా, ధనియాల పొడి, మిర్చిపొడి మరియు కసూరీ మేథీ. మరింత ఉప్పు వేయండి.
  • ఈ మిశ్రమాన్ని 4-5 నిమిషాలపాటు వేయించండి.
  • జీడిపప్పు పేస్ట్ మిశ్రమానికి జోడించండి. ఈ మిశ్రమాన్ని మరో 3-5 నిమిషాలపాటు వేయించండి.
  • గ్రేవీ స్థిరత్వానికి అనుగుణంగా మిశ్రమానికి నీటిని కలపండి, ఈ మిశ్రమం చిక్కబడటం కొరకు మరో 2 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచండి.
  • మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు, మరో ప్యాన్‌లో వెన్న వేసి, దానిలో పన్నీర్ ముక్కలను ఫై చేయండి. బంగారు వర్ణంలోనికి మారేంత వరకు వాటిని ఫ్రై చేయండి.
  • ఫై చేయబడ్డ పన్నీరును గ్రేవీకి జోడించండి, మిశ్రమాన్ని కాసేపు సిమ్‌లో ఉంచండి, తద్వారా పన్నీర్ మృదువుగా మారుతుంది.
  • గ్రేవీ మిశ్రమం మరింత చిక్కగా ఉండటం కొరకు క్రీమ్‌ని కూడా జోడించవచ్చు.
  • రుచి కొరకు మిశ్రమానికి మరింత వెన్న జోడించవచ్చు.
  • కొత్తిమీరతో గార్నిష్ చేయండి.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు 410 గ్రాములు 
మొత్తం కొవ్వు 30 గ్రాములు   
కార్బోహైడ్రేట్‌లు    40 గ్రాములు
 ప్రోటీన్‌లు 15 గ్రాములు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి